అగ్నిపథ్‌ పథకం నియామకాల్లో 20 శాతం మంది మహిళలు!

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


సాయుధ బలగాల్లో నియామకాల కోసం నరేంద్ర మోదీ సర్కార్‌ కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం కింద ఈ ఏడాది నేవీలో చేపట్టే నియామకాల్లో 20 శాతం మంది మహిళలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. నేవీలో ఈసారి మూడువేల మందిని ఎంపికచేస్తారు. అగ్నిపథ్‌ ద్వారా నేవీ తొలిసారిగా మహిళా నావికులను నౌకాదళంలోకి తీసుకోనుంది. అన్ని విభాగాల అప్లికేషన్లు జూలై 30వ తేదీ దాకా తీసుకుంటారు. ఉద్యోగ నియామకాల కోసం ఇప్పటివరకు 10 వేల మందిపైగా మహిళా అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, అగ్నిపథ్‌ పథకాన్ని రద్దుచేయాలంటూ మంగళవారం సుప్రీంకోర్టులో మాజీ సైనికాధికారి రవీంద్రసింగ్‌ షెకావత్‌ పిటిషన్‌ దాఖలుచేశారు.

 

Tags: 20 percent women in Agnipath scheme appointments!

Leave A Reply

Your email address will not be published.