ముత్తుకూరు గేట్ సెంటర్ లో 200 మంది యాచకులు, నిరాశ్రయులకు అన్నదానం

Date::03/04/2020

నెల్లూరు ముచ్చట్లు:

స్థానిక 17 వ డివిజన్ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో సోమిరెడ్డి స్వరూప్ రెడ్డి శుక్రవారం సుమారు 200 మందికిపైగా యాచకులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 6 వ నగర పోలీస్ స్టేషన్ సి ఐ సోమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలు సలహాల మేరకు జిల్లాలో నిర్వహించబడుతున్న లాక్ డౌన్ కారణంగా అనేక మంది పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు అని తెలిపారు. ఇటువంటి  ఆపత్కాలంలో తమ వంతు సహాయం చేయుటకు ముందు ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కే సతీష్ మాట్లాడుతూ కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ జనాభాను గడగడలాడిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కావడం జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న ట్లు తెలుస్తుందన్నారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో నడుస్తున్న లాక్ డౌన్ సందర్భంగా ఈనెల 14వ తేదీ వరకు నెల్లూరు జిల్లా సీఎం శాఖ ఆధ్వర్యంలో పలు ప్రదేశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎస్ డి చాంద్ భాషా, ఎస్.కె నజీర్, బి ప్రసాద్, బి మల్లికార్జున్, వంశీ, శ్రీనివాసులు,  ఎస్ డి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

 ప్రభుత్వ ఆసుపత్రికి ఐదువేల  శానిటైజర్లు

Tags:200 beggars and homeless in Muttukur Gate Center.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *