Natyam ad

200 అడుగుల జాతీయ జెండా ర్యాలీ

నరసాపురం ముచ్చట్లు:


స్వతంత్ర సమరయోధుల కృషి వల్ల ఈ రోజున భారతదేశంలో స్వతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం శ్రీసూర్య కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ అన్నారు.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో  శ్రీ సూర్య కళాశాల ఆధ్వర్యంలో 200 అడుగులు పొడవైన జాతీయ జెండాతో జాతీయ భావం చాటుతూ విద్యార్థులు ప్రదర్శన చేశారు.ఆజాద్ కా అమృత్ మహోత్సవం  హర్ ఘర్ తిరంగా లో భాగంగా చేసిన ఈ ప్రదర్శన పట్టణంలో ని పలు వీధులు గుండా అంబేద్కర్ కూడలికి చేరింది.  ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేయాలని నినాదాలు చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న  అధ్యాపకులు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

 

Tags: 200 feet national flag rally

Post Midle
Post Midle