Natyam ad

2014 ఎన్నికలకు 2024 ఎన్నికలకు ఎంతో తేడా ఉంది

– నేడు ప్రజలకు జగనన్న భరోసా కల్పించారు
– ఎన్ని పొత్తులు పెట్టుకున్న జనం మావైపే
– ఎంపీ మిధున్‌రెడ్డి మనోగతం

పుంగనూరుముచ్చట్లు:

Post Midle

2014 ఎన్నికల్లో మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఒక్కహామిని నేరవేర్చకుండ ప్రజలను మోసగించిన చంద్రబాబుకు…. 2019 పాదయాత్రలో ఇచ్చిన హామీలను తూచతప్పకుండ నేరవేర్చి ధైర్యంగా ఓట్లు అడుగుతున్న జగనన్నకు ఎంతో తేడా ఉంది….పదేళ్ల క్రితం మోసపోయిన ప్రజలకు జగనన్న నేడు భరోసాగా నిలిచారని….ప్రతి ఇంటా సంక్షేమాన్ని కోరుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అని రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరు ఎన్నిపొత్తులు పెట్టుకున్న జనం మాత్రం జగనన్న వైపేనని స్పష్టం చేశారు. పదవుల కోసం కాకుండ పేద ప్రజల అభ్యున్నతి కోసం తపన పడుతున్న జగనన్న మ్యానిఫెస్టోను 100కి 100 శాతం అమలు చేశారు. అదే ధైర్యంతో తాము నియోజకవర్గ ఓటర్లకు వివరిస్తూ ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం. ప్రజలు ఎంతో సాదరంగా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కుయుక్తులతో , పొత్తుల పార్టీలతో ప్రజలను మోసగించేందుకు చందమామను తెచ్చి ఇస్తామని హామి ఇస్తాడని , వాటిని నమ్మవద్దని, 2014 చంద్రబాబు పాలనను గుర్తు చేసుకోవాలన్నారు. జన్మభూమి కమిటిల పేరుతో పచ్చమూకలు చేసిన ఆగడాలను మరచిపోవద్దని ఓటర్లకు సూచించారు. పొత్తుల పార్టీల పాలన వస్తే రాష్ట్రంలో మతోన్మాదం చెలరేగుతుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా రెండవ సారి ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలందరు ఆలోచించి గారడి మాటలకు లోనుకాకుండ రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తు పై వేయాలని , ఎంపీగా తనను, పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తమ వెంట ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.

 

Tags: 2014 elections are very different from 2024 elections

Post Midle