2019కి రెడీ అవుతున్న బాబు

Date:12/03/2018
విజయవాడ ముచ్చట్లు:
అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగిన టీడీపీ, …మరికొద్ది రోజుల్లో ఎన్‌డీఏ నుంచి కూడా వైదొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరైనా కలిసొస్తారో.. రారో అనేది ఖరారు కాకపోయినా మొత్తం 175 నియోజకవర్గాల్లో నేరుగా తన అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముగించిన చంద్రబాబు తరువాతి వ్యూహంపై కసరత్తు ప్రారంభించారని సమాచారం. సీఎం రవేుశ్‌కి రెండో టర్మ్ ఇస్తారనేది ముందునుంచి అందరూ అనుకున్నదే అయినా లీగల్‌సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ పేరు అనూహ్యంగా చిట్టచివరి నిముషంలో ఖరారు కావడం టీడీపీ వర్గాలను ఒకింత ఉలిక్కిపడేలా చేసింది. ఢిల్లీ నుంచి అత్యున్నత స్థాయి వర్గాల సిఫార్సు మేరకు కనకవేుడల అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కనకవేుడల అభ్యర్థిత్వం బట్టే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండనుందో చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలతో పాటు చంద్రబాబు సర్వేలో డి-గ్రేడ్ వచ్చిన మరో 18 నియోజకవర్గాలపై చంద్రబాబు స్వయంగా కసరత్తు చేయుడంతో పాటు.. తనకు అత్యంత విశ్వాసపాత్రులకు అప్పగించారని చెబుతున్నారు. సాధారణంగా చంద్రబాబుకు 8 మార్గాల ద్వారా ప్రతి అంశంపై నివేదిక తెప్పించుకోవడం ఆనవాయితీ. ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ 8 మార్గాల ద్వారా నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, నగర, పట్టణ, గ్రామ బూత్ కమిటీల నివేదికను తెప్పించుకుని కూలంకషంగా మదింపు చేసేవారని చెబుతారు. తొలుత టీటీడీ పాలక మండలి నియామకం పూర్తి చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్వీబీసీ చానల్ సీఈవో నరసింహారావును తొలగించి, ఇన్‌చార్జ్ సీఈవోను నియుమించారు. టీటీడీ చైర్మన్ పదవికి దాదాపు పేరు ఖరాైరెందని అనుకుంటున్న యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌ను చంద్రబాబు వెలగపూడి సచివాలయానికి పిలిపించి మాట్లాడారు. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు, అభ్యర్థుల ఎంపికపై ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం ప్రారంభించారని చెబుతున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గాల పరిశీలకులు ఈ సమీక్షలో పాల్గొంటున్నారు. చంద్రబాబు నేరుగా ఇన్‌చార్జ్ మంత్రి, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో ముఖాముఖి చర్చించి, తన దగ్గర ఉన్న సమాచారాన్ని బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే పదవీకాలం పూర్తయిన అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియుమించేందుకు జాబితాలను సిద్ధం చేయుమని ఆదేశించినట్లు చెబుతున్నారు.
Tags: 2019 is going to be

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *