శ్రీ క‌పిలేశ్వ‌రస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో సాంస్కృతిక శోభ‌

Date:17/02/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌ సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా సోమ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.

శ్రీ క‌పిలేశ్వ‌రస్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో ఉదయం 6 నుండి 6.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఎస్‌.మునిర‌త్నం బృందం మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన జి.పార్వ‌తి బృందం శివ‌స్తోత్రం నిర్వ‌హించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు నంద్యాల‌కు చెందిన శ్రీ రామ‌మోహ‌న‌శ‌ర్మ ధార్మికోప‌న్యాసం చేశారు. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ జి.మునిల‌క్ష్మి బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి కె.విశాలాక్షి బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు సంకీర్తనాలాప‌న, సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు చెన్నైకి చెందిన ప‌గ‌డాల ల‌క్ష్మి బృందం భ‌క్తి సంగీతం వినిపించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి సాకె అన్న‌పూర్ణ బృందం ఊంజ‌ల్‌సేవ‌లో భ‌క్తి సంకీర్త‌న‌లు ఆల‌పించారు.

అదేవిధంగా తిరుపతిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన   ఎం.భార్గ‌వి, వివి.వాస ప్ర‌సాద్‌ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

అఖిల‌భార‌త వేదశాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై అద‌న‌పు ఈవో స‌మీక్ష‌

Tags: Cultural splendor at Sri Kapileswaraswamy Brahmotsavam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *