అఖిల‌భార‌త వేదశాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై అద‌న‌పు ఈవో స‌మీక్ష‌

Date:17/02/2020

తిరుపతి ముచ్చట్లు:

ఫిబ్ర‌వ‌రి 25 నుండి మార్చి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హ‌ణ‌

దేశం న‌లుమూల‌ల నుండి 715 మంది విద్యార్థులు, 115 మంది అధ్యాప‌కులు రాక‌

వేద ప‌రిరక్ష‌ణ కార్యక్ర‌మాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 25 నుండి మార్చి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న 28వ అఖిల‌భార‌త శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌లలోని ధ‌ర్మ‌గిరి ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో ఈ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేసేందుకు అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. అనంత‌రం సివిల్ ఇంజినీరింగ్ ప‌నులు, ఎల‌క్ట్రిక‌ల్‌, వాట‌ర్‌వ‌ర్క్స్‌, అన్న‌ప్ర‌సాదం, బ‌స‌, వైద్యం, ర‌వాణా, పారిశుద్ధ్యం, పుష్పాలంక‌ర‌ణ‌, భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌తో చ‌ర్చించారు. ఆ త‌రువాత వేద పాఠ‌శాల‌లోని యాగ‌శాల, స‌ద‌స్సు వేదిక ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని మాట్లాడుతూ ఫిబ్ర‌వ‌రి 25న ఉద‌యం 10.30 గంట‌ల‌కు స‌ద‌స్సు ప్రారంభమ‌వుతుంద‌ని, దేశం న‌లుమూల‌ల నుండి 715 మంది విద్యార్థులు, 115 మంది అధ్యాప‌కులు పాల్గొంటార‌ని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 26 నుండి 29వ తేదీ వ‌ర‌కు వివిధ విభాగాల్లో అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని, మార్చి 1న ముగింపు కార్య‌క్ర‌మంలో స‌ర్టిఫికెట్లు ప్ర‌దానం చేస్తామ‌ని వివ‌రించారు. మొత్తం 54 వేద శాఖ‌లకు సంబంధించిన ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయ‌ని, వీటిలో ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి 5 గ్రాముల బంగారు డాల‌రు, ద్వితీయ శ్రేణిలో నిలిచిన వారికి 10 గ్రాముల వెండి డాల‌రు బ‌హుమానంగా అందిస్తామ‌న్నారు. గ‌తంలో 27 సార్లు శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సులు జ‌రిగాయ‌ని వివ‌రించారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డెప్యూటీ ఈవోలు   హ‌రీంద్ర‌నాథ్‌,   బాలాజి,   దామోద‌ర్‌,  నాగ‌రాజ‌, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్ఆర్‌.రెడ్డి, విఎస్‌వో   మ‌నోహ‌ర్‌, క్యాట‌రింగ్ అధికారి   జిఎల్ఎన్‌.శాస్త్రి, ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్   శ్రీ‌నివాసులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

Tags: Its Evo Summit on the Arrangements for the August Scholarship of All India Theology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *