శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

Date:21/02/2020

తిరుప‌తి ముచ్చట్లు:

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఆల‌యంలో నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.
శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మండ‌పంలో శ్రీ ఎం.హ‌రిబాబు బృందం ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 8.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఎం.జ‌య‌ల‌క్ష్మి బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం నిర్వహించారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు రాజ‌మండ్రికి చెందిన అమ్మిరెడ్డి పేర‌య్య‌నాయుడు ధార్మికోప‌న్యాసం చేశారు.
మ‌ధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు తిరుప‌తికి  చెందిన   ఎల్‌.శ్రీ‌నివాస‌రావు బృందం హ‌రిక‌థ పారాయ‌ణం,  సాయంత్రం 4.00 నుండి  5.00 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ శివ‌ర‌త్నం బృందంచే అన్న‌మ‌య్య విన్న‌పాలు,  సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన పి.శ్రీ‌శైల‌జ‌ బృందం అన్న‌మ‌య్య సంకీర్తన‌ల‌ను ఆల‌పించ‌నున్నారు.

శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

Tags: Cultural Activities of Sri Kalyana Venkateswaraswamy Brahmotsavam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *