Jaganmohan Reddy as Chief Minister prayed for 30 years

ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి 30 సంవత్సరాలు ఉండాలని ప్రార్థించా

– మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

Date:21/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 30సంవత్సరాలు కొనసాగేలని భగవంతున్ని ప్రార్థించినట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగస్తీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సుబిక్షంగా ఉండేందుకు, వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముప్పె సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉండేలా భగవంతున్ని ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. ర్ఖా•భివృద్ధి కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఎనిమిది నెలలకాలంలోనే ఎన్నికల మ్యానిఫెస్టోను అములు చేసిన ఘనత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌ రెడ్డి, నాగరాజారెడ్డి, జెడ్పీమాజీ ప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు.

 ప్రత్యేక హారతులు…ఆధ్యాత్మిక కార్యక్రమాలు

Tags; Jaganmohan Reddy as Chief Minister prayed for 30 years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *