Special pujas in Shiva temples

శివాలయాలలో ప్రత్యేక పూజలు

– శివనామస్మరణతో భక్తుల జాగరణ
– ఉపవాసాలతో భక్తజనం

Date:21/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలలో ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం వేకువజాము నుంచి ఆలయాలు శివనామస్మరణతో భక్తిపారవశ్యమైంది. భక్తులు ఉపవాసదీక్షలతో జాగరణ చేశారు. పుంగనూరు పట్టణంలోని శ్రీ బోగంజుండేశ్వరస్వామి ఆలయం, కోనేటి వద్ద గల శ్రీ కాశీవిశ్వేరస్వామి ఆలయం, నగరిలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయలం, మండలంలోని యాబైరాళ్ల వెహోరవేశ్వరస్వామి ఆలయం, భీమగానిపల్లెలో గల భీమేశ్వరస్వామి ఆలయం, నెక్కుంది గ్రామంలో గల శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచి ఆలయాలలో హ్గమాలు నిర్వహించి, స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు హరహరమహాదేవ శంబోశంకర అంటు శివనామస్మరణ చేశారు. ఉదయం నుంచి భక్తులు ఉపవాస దీక్షలతో రాత్రి జాగరణ చేశారు. శనివారం భక్తులు శివాలయాలలో పూజలు చేసి, ఉపవాసాలు తీర్చనున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తుల రద్దీతో క్రిక్కిరిసిపోయింది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

అగ్నిగుండం….

పట్టణంలోని ప్యాలెస్‌ ఆవరణంలో గల శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్ద అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ప్రతి యేటా వీరశైవలింగాయతులు, జంగమదేవర్లు కలసి అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, వెహోక్కులు చెల్లించుకున్నారు.

22న ముస్లిం మహిళలు ర్యాలీ

Tags: Special pujas in Shiva temples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *