Sri Agastheeswara Swamy Temple will be developed in all ways

శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

– మంత్రి పెద్దిరెడ్డి

Date:21/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని నెక్కుంది గ్రామ సమీపంలో ఎతైన కొండల మధ్య వెలసిన శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.శుక్రవారం ఆయన మహాశివరాత్రి సందర్భంగా అగస్తీశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చోళుల కాలంలో నిర్మించిన స్కందపుష్కరణి మరమ్మతులకు రూ.3.10 కోట్లతో పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పుష్కరణి ప్రాంతాన్ని పరిశీలించి కాంటాక్టర్‌ శ్రీధర్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. త్వరలోనే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగస్తమహామునిచే ప్రతిష్ఠించబడిన ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఇప్పటికే ఆలయానికి రోడ్డు, విద్యుత్‌దీకరణతో పాటు సుమారు రూ.1.50 కోట్లతో ఆలయ మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే స్వామివారి బ్రహ్గ్మత్సవాలకు నూతన రథాన్ని తయారు చేయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆలయానికి ప్రహారీతో పాటు పుష్కరణి, కాటేజులు కూడ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు అగస్తీశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ జెడ్పీప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, ఆర్టీసి మజ్ధూర్‌ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ మనోహర్‌తో పాటు పెద్దిరెడ్డి యువజన సంఘ నాయకులు రాజేష్‌, సూరి , హేమంత్‌, జెపియాదవ్‌, బండకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

23న భారత్‌బంద్‌

Tags: Sri Agastheeswara Swamy Temple will be developed in all ways

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *