శ్రీకపిలేశ్వర‌స్వామివారిని ద‌ర్శించుకున్న కేంద్ర స‌హాయ మంత్రి

Date:21/02/2020

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారిని మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శుక్ర‌వారం కేంద్ర సూక్ష్మ‌, చిన్న మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ మంత్రి   ప్ర‌తాప్‌చంద్ర సారంగి ద‌ర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ. కేంద్ర స‌హాయ మంత్రికి ఆల‌య అధికారులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆల‌యంలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారిని, శ్రీ కామాక్షి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యాధికారులు తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో   సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌   భూప‌తిరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌   శ్రీ‌నివాస్‌నాయ‌క్ పాల్గొన్నారు.

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

Tags: Union Minister of Finance to look into Srikapileshwaraswamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *