ఉగాదికి అందేనా..? (శ్రీకాకుళం)

Date;26/02/2020

శ్రీకాకుళంముచ్చట్లు;

హుద్‌హుద్‌ తుపాను బీభత్సం మిగిల్సి వెళ్లి అయిదేళ్లు దాటింది. ఆ భయానక ఉపద్రవంతో సర్వం కోల్పోయిన అభాగ్యులకు ఇప్పటికీ సొంత గూడు

కరవయింది. వారి కోసమే అంటూ తలపెట్టిన ఇళ్లు చాలా చోట్ల వారికి చేతికి అందలేదు. అలా…ఏళ్లు గడిచిపోతున్నాయి. నిర్మించినవీ ఆనవాళ్లు కోల్పోతున్నాయి. పనులు పూర్తి కానివి

ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు లబ్ధిదారుల ఎంపికపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 2014 అక్టోబరులో హుద్‌హుద్‌ తుపాను వచ్చింది. 2015లో ‘హుద్‌హుద్‌’

ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు అప్పగించారు. మరికొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ అప్పగించలేదు. టెక్కలి, సోంపేటల్లో

ఇంకా నిర్మాణాలే పూర్తవలేదు. తాజాగా ఉగాది నాటికి స్థానికంగా ఇళ్లులేని పేదలకు ఈ గృహాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో పేదల గూటికి ఈ పండగైనా

కలిసొస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నో అనుమానాలు కూడా ముసురుకుంటున్నాయి.నిజమైన లబ్ధిదారులకే చేరుతాయా? అనే సందేహాలను పలువురు వ్యక్తం

చేస్తున్నారు. ఇళ్లకోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కవిటిలో 64, పలాస-కాశీబుగ్గ పట్టణంలో పరిధిలో 192, వజ్రపుకొత్తూరు మండలం బెండిలో 192, సంతబొమ్మాళి

మండలం లక్ష్మిపురం వద్ద 174, కోటబొమ్మాళిలో 192, శ్రీకాకుళం గ్రామీణమండలం కుందువానిపేట వద్ద 288, బేడవానిపేట వద్ద 48ఇళ్లు పూర్తయ్యాయి. అయితే ఇంతవరకు

వీటిని లబ్ధిదారులకు అందజేయలేదు. మరో వైపు టెక్కలిలో 192, సోంపేటలో 80 ఇళ్లు ఇంకా పనులు పూర్తి కాలేదు. ఉగాది నాటికి వీటి పనులను పూర్తి చేయాలని అధికారులకు

ఆదేశాలు అందాయి. పంపిణీ చేస్తే ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలు నెరవేరుతాయని భావిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని

పలువురు కోరుతున్నారు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇచ్చేందుకు ఇళ్లు నిర్మించినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక జాబితాలు గత ప్రభుత్వం సిద్ధం చేయలేదు.

తాజాగా మళ్లీ లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా నిర్వహించే అవకాశముంది. ఈ క్రమంలో అనర్హులకు దక్కకుండా పారదర్శకంగా సాగాలని సూచనలొస్తున్నాయి. గతంలో పూర్తయిన

హుద్‌హుద్‌ ఇళ్లలో చోరీలు జరగడంతో జరిగిన పనులు రూపుకోల్పోయాయి. ప్రధానంగా విద్యుత్తు సామగ్రి, తలుపులు దొంగిలించారు. కవిటి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి కేంద్రాల్లో భారీగా

నష్టం వాటిల్లింది. పలాసలోనూ భారీగా జరిగినప్పటికీ కాంట్రాక్టర్లతో మళ్లీ పనులు జరిపించారు. ఆ కొద్దిరోజులకే మళ్లీ దొంగతనాలు జరిగాయి. లబ్దిదారులకు ఇళ్లు అప్పగించాలంటే ఆ పనులను

ఎవరు చేస్తారన్నదానిపై మీమాంస నెలకొంది.

వేసవి ఎట్లా..?(కడప)

Tags;Ugadi got it ..? (Srikakulam)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *