ఎప్పుడిస్తారు..? (అనంతపురం)

Date;26/02/2020

అనంతపురం ముచ్చట్లు

 

పప్పుశనగ పంటకు గిట్టుబాటు ధర లేక.. గోదాముల్లో నిల్వ ఉంచిన రైతులకు పరిహారం అందించి ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు జిల్లాలో పప్పుశనగ ఎంత పండింది. ఎన్ని గోదాముల్లో ఎంత నిల్వ ఉంది. రైతులెంత మంది ఉన్నారన్న దానిపై సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 జూన్‌లో సర్వే

చేపట్టి వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలోని 20 గోదాముల్లో 3,867 మంది రైతులకు సంబంధించి 3,05,875 క్వింటాళ్ల

పప్పుశనగ నిల్వలు ఉన్నాయి. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 30 క్వింటాళ్లకు రూ.1500 చొప్పున.. రూ.45 వేలు వరకు పరిహారం అందించాలని నిర్ణయించారు. ఈలెక్కన రూ.26.50

కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నివేదించారు. జిల్లాలో 3,867 మంది రైతులు ఉన్నారు. 3,05,875 క్వింటాళ్ల శనగలు నిల్వలు ఉన్నాయి. ఆ ప్రకారం రూ.26.50 కోట్లు

పరిహారం ఇవ్వాల్సి ఉంది. గతేడాది జూన్‌ నుంచే సర్వే ప్రారంభించారు. సెప్టెంబరు నుంచి మూడు విడతల్లో 1,804 మంది రైతులకు రూ.6,49,18,966 సొమ్ము ఖాతాలకు

జమ చేశారు. ఇంకా 2,063 మంది రైతులకు రూ.20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. సొమ్ము కోసం అన్నదాతలు అర్జీలు ఇస్తూనే ఉన్నారు. ఐదారు నెలల నుంచి కార్యాలయాల

చుట్టూ తిరుగుతున్నారు. పొలాలు ఒక మండలంలో, నివాసం మరో మండలంలో ఉండడంతో ఈ-పంట నమోదు చేసుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పప్పుశనగ పంట

పండించారు. ధరల్లేక గోదాముల్లో నిల్వ చేశారు. అయితే ఈ-పంటలో నమోదు కాలేదు. అయినా పరిహారం ఇవ్వాలని రైతుల నుంచి డిమాండు పెరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం

దృష్టికి తీసుకెళ్లారు. ఈ-పంట లేకున్నా మండల వ్యవసాయాధికారితో సాగు ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుందని నిబంధన సడలించారు. రైతులంతా మళ్లీ వ్యవసాయశాఖ కార్యాలయాలు

చుట్టూ తిరిగి సాగు పత్రాలు అందజేశారు. ఆలెక్కన 12,05 మంది రైతులు తేలారు. ఆ పత్రాలపై మళ్లీ సర్వే చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్‌,

రెవెన్యూశాఖల అధికారులను బృందాలుగా వేశారు. ఆయా బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. కలెక్టర్‌ ద్వారా సర్వే నివేదికను ప్రభుత్వానికి పంపుతారు. అనంతరం ఆర్టీజీఎస్‌

నుంచి సొమ్ము రైతు ఖాతాలకు జమ కానుంది. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ లెక్కల ప్రకారం మొత్తం 3,867 మంది రైతులు ఉన్నారు. వారిలో మూడు విడతల్లో 18,04 మంది

రైతులకు సొమ్ము చెల్లించారు. మరో 1,205 మంది రైతుల వివరాలపై మళ్లీ సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను తేల్చి, వారికి సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇంకా 1000 మంది రైతులు ఉన్నారు. వారికి ఇస్తారా.. లేదాన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 

Tags;Eppudistaru ..? (Anantapur)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *