పారపట్టిన ఎమ్మెల్యే చిన్నయ్య

Date;26/02/2020

పారపట్టిన ఎమ్మెల్యే చిన్నయ్య

బెల్లంపల్లి ముచ్చట్లు:

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా  బెల్లంపల్లి పట్టణంలో ని పలు వార్డులలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటించి వార్డులలో ఉన్న సమస్యలను, అడిగి తెలుసుకుని  పార పట్టి చెత్త చెదారం  ను పిచ్చి మొక్కలను తీసివేయడంతో , ఆయన వెంట ఉన్న అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు, పారలు పట్టి నడుమువంచి పనిచేయక తప్పలేదు,స్వయానా ఎమ్మెల్యే వార్డుల  ప్రజల్లోకి  వెళ్లడంతో ఇది చూసిన  ప్రజలు కలిసి కట్టుగా పట్టణ ప్రగతిలో పనిచేస్తే  తమ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడుతాయని వార్డులు అభివృద్ధి చెందుతుంది చర్చించుకుంటున్నారు.

పట్టణ ప్రగతి లో భాగంగా  4వ వార్డులోని  కాలనిలోని  రోడ్లు,విద్యుత్ స్తంభాలు, మురికి కాలువలు, చెత్త చెదారం,ఇంకా  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి సమస్య ప్రజల  భాగస్వామ్యం తోనే పరిష్కరించబడుతుందని, అభివృద్ధి పనుల్లో ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు ఈకార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్ లు, ,అస్మా  యూసుఫ్  బస్తి ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

ఫ్యాక్టరీలో తనిఖీ చేసిన మహిళా పోలీసులు

Tags;Disgraced MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *