Arvo Plant Donation to School

పాఠశాలకు ఆర్‌వో ప్లాంటు విరాళం

Date:26/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని నేతిగుట్లపల్లె ప్రాథమిక పాఠశాలకు ఆర్‌వో ప్లాంటును విరాళంగా బుధవారం అందజేశారు. గ్రామానికి చెందిన దివంగత మేనేజర్‌ నాగరాజ నాయక్‌ కుటుంబ సభ్యులు కృష్ణవేణి, శరత్‌, హరిప్రసాద్‌లు కలసి పాఠశాలలో సుమారు రూ.20 వేలు విలువ చేసే ప్లాంటును అందజేశారు. ఎంఈవో కేశవరెడ్డి ఆర్‌వో ప్లాంటును ప్రారంభించి దాతలను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఆదుకునేందుకు కృష్ణవేణి కుటుంబ సభ్యులు చూపిన సహకారాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం బుడ్డన్న, ఉపాధ్యాయులు తులసిదాస్‌, వేమారెడ్డి, వెంకటరెడ్డి, బుడ్డన్ననాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆరు మంది జూదర్లు అరెస్ట్

Tags: Arvo Plant Donation to School

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *