మధ్యం మత్తులో హ్గంగార్డుపై దాడి

– పోలీసుల అదుపులో నిందితుడు

Date:26/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మధ్యం మత్తులో హ్గంగార్డుపై దాడి చేసి గాయపరచిన సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. బోయకొండ గంగమ్మ దేవస్థానానికి చిత్తూరు ఏఆర్‌ పోలీసులు కుటుంబ సభ్యులతో కారులో వెళ్లారు. దర్శనానంతరం తిరిగి పట్టణ సమీపంలోని మేలుపట్ల వద్దకు రాగా ఆ ప్రాంతానికి చెందిన ఉదయ్‌కుమార్‌ అనే యువకుడు తమిళనాడు కారును ఆపి ఘర్షణకు దిగాడు. దీంతో ఏఆర్‌ పోలీసులు పుంగనూరు పోలీసులకు ఫోన్‌ చేశారు. వెంటనే స్టేషన్‌లో ఉన్న రక్షక్‌ టీమ్‌ హ్గంగార్డు కిరణ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉదయ్‌కుమార్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన హ్గంగార్డును మధ్యం సేవించిన ఉదయ్‌కుమార్‌ దురుసుగా మాట్లాడుతూ చేతులతో కొట్టి గాయపరిచాడు. హ్గంగార్డుకు రక్తగాయాలైంది. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి , నిందితున్ని అదుపులోనికి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

2021 నాటికి పోలవరం పూర్తి

Tags: Attack on Haggard in the middle intoxication

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *