Chandrababu should take advice

నేర చరిత్ర వుంది..పిలవలేదు

Date;26/02/2020

నేర చరిత్ర వుంది..పిలవలేదు

విజయవాడ ముచ్చట్లు:

గత రెండు రోజులుగా దేశమంతటా , రాష్ట్రమంతటా ఒకటే చర్చ. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చిన సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు ఏపీ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఎందుకు లేదన్న చర్చ రెండు రోజులుగా జరుగుతోంది.  మన సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులకు విందుకు  పిలిచారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం పిలవలేదు. జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర, క్రిమినల్ కేసులు, నియంత వ్యవహారం ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది

కాబట్టే ఈరోజు పిలుపు  రాలేదని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.  పిలుపు రానందుకు సిగ్గు పడాల్సినంది పోయి వైసీపీ నాయకులు వెకిలి  నవ్వులు నవ్వుతూ దీనికి సమాధానం చెప్పకుండా దాటవేసే పరిస్థితికి వచ్చారు.  ఎంత దౌర్భాగ్యమంటే…ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ప్రపంచంలో తెలుగువారు  ఎక్కడి వెళ్లి మాట్లాడినా, కలిసినా మద్రాసీలా అని అడిగేవారు. ఆ స్థాయి నుంచి మేం తెలుగు వారం అని గర్వంగా చెప్పే స్థాయికి ఎన్టీఆర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు   హయాంలో అనేక పరిశ్రమలు పెట్టుబడులుతో వచ్చాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను తీసుకొచ్చారు. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ కంపెనీ న్యూయార్క్ లోనే ఉండేది. దాని బ్రాంచ్
ఏపీకి తీసుకొచ్చి ఘనత చంద్రబాబుదేనని అన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి సాఫ్ట్ వేర్ దిగ్గజం బిల్ గేట్స్ ను తీసుకొచ్చారు. అమెరికా, సింగపూర్ , నేపాల్  దేశాధినేతలతో పాటు ప్రపంచ బ్యాంకు అధ్యక్షులు, ఐక్యరాజ్యసమతి ప్రధాన కార్యదర్శి, మారిషస్ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చారు.   ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి  ఉంటే డోనాల్డ్ ట్రంప్ గుజరాత్ వెళ్లకుండా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉండేవారని ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

ఇవాళ రాష్ట్ర పరిస్థితికి వైసీపీనే కారణమని అందరికీ తెలుసు. వీరి  యొక్క విధానాల వల్ల ఈ రోజు పిలుపుకు నోచుకోలేదు. 96 మందిని పిలిస్తే అందులో ఏపీ సీఎం లేరు. వీరి యొక్క విధి విధానాలు, ప్రవర్తన, ప్రపంచస్థాయిలో వీరికున్న మనీల్యాండరింగ్  కేసుల వల్ల పిలుపు అందలేదన్నది స్పష్టమవుతోంది.  ఇంటర్ పోల్ వాళ్లు వీరిని వెదుకుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడైనా పర్యటిస్తే ఆ దేశం వారు ఎవరిని పిలవాలో పిలవకూడదో  చెక్ చేసుకుంటారు . ఇవాళ జగన్మోహన్ రెడ్డి కి పిలుపు అందకపోవడానికి కారణం అదేనని ఆమె అన్నారు.  జగన్ అండ్ గ్యాంగ్ ఏ దేశం వెళ్లినా అక్కడి విమానాశ్రయాల్లో పట్టుకుని జైళ్లలో
పెట్టేస్తున్నారు. అందుకు సాక్ష్యం నిమ్మగడ్డ ప్రసాద్. బెల్ గ్రెడ్ విమానాశ్రయంలో ఆయనేదో విహారయాత్రకు వెళితే అక్కడ పట్టుకుని జైల్లో పెట్టారు. ఇప్పుడు జగన్  వెళ్లినా అదే పరిస్థితి అని  ఆమె అన్నారు

. నంద్యాల తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రవి కుమార్

Tags;.There is a criminal record

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *