విజయవాడ లో ఐ.టి. అధికారుల మెరుపు దాడి.

Date:26/02/2020

విజయవాడ ముచ్చట్లు:

ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపుతున్న డాక్టర్ల పై కొరడా ఎక్కు పెట్టిన ఐ.టి. అధికారులు. రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కార్పోరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు, డాక్టర్లు. ఆదాయం  కోట్లలో ఉన్నప్పటికీ  ఆదాయపన్ను శాఖకు మాత్రం పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు.విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను  క్షుణ్నంగా పరిశీలిస్తున్న ఐటీ అధికారులు.ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన ఐ.టి.ఐటి రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో  కోట్ల రూపాయల్లో ఆదాయం ఉన్నప్పటికీ  పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు ఐటీ అధికారులు పరిశీలనలో వెల్లడి.ఉదయం నుండి పది మందికి పైగా ఐటీ అధికారులు రోగులకు ఇబ్బంది కలగకుండా ఆసుపత్రిలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.ముందు ముందు రిటర్న్స్ దాఖలు చేయని  ఆసుపత్రుల్లో కూడా త్వరలో  దాడులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత

Tags: IT in Vijayawada Lightning attack by officers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *