Larry is a broken electric transformer

లారీ ఢీకొని విరిగిపడిన విద్యుత్‌  ట్రాన్స్ ఫార్మర్

– తప్పిన పెను ప్రమాదం

Date:26/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు- శంకర్రాయలపేట రహదారిపై గల అరవపల్లె మలుపు వద్ద లారీ ఢీకొనడంతో విద్యుత్‌ ట్రాన్స్ ఫార్మర్ తో సహా ఆరు విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. అదృష్టవశాత్తు రాత్రి కావడంతో ఎలాంటి నష్టము జరగలేదు. అరవపల్లె గ్రామానికి చెందిన విద్యుత్‌ లైను రహదారిపై చామంతికుంట చెరువులో ఇటుకల బట్టీలతో పాటు వివిధ వ్యవసాయ కనెక్షన్లకు ఉంది.ఇలా ఉండగా రాత్రి సుమారు 9 గంటల సమయంలో లారీలో హిటాచి వాహనాన్ని తీసుకెళ్తూ రహదారిపై విద్యుత్‌ స్తంబానికి ఢీకొంది. ఒక్కసారిగా భయంకరమైన శబ్ధంతో విద్యుత్‌ ఆగిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురైయ్యారు. గమనించడంతో గ్రామంలోని ఐదు విద్యుత్‌ స్తంబాలు, ట్రాన్స్ ఫార్మర్ తో ఉన్న స్తంభం భూమి పై భాగానికి విరిగిపడిపోవడాన్ని గమనించి వెంటనే విద్యుత్‌శాఖాధికారులకు సమాచారం అందించారు. విద్యుత్‌ సరఫరాను ఆపివేశారు. రద్దీగా ఉండే రహదారిపై ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిని వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పాఠశాలకు ఆర్‌వో ప్లాంటు విరాళం

Tags: Larry is a broken electric transformer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *