Prohibitions at the Summer Storage Tank

సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు వద్ద నిషేదాజ్ఞలు

– వాహనాలకు, ప్రజలకు అనుమతి లేదు
– నీటిని కలుషితం చేస్తే పోలీస్‌ కేసులు
– వాహనాలు సీజ్‌ చేస్తాం
– కమిషనర్‌ కెఎల్‌.వర్మ హెచ్చరిక

Date:26/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకును నిషేధిత ప్రాంతంగా ప్రకటించామని ఈ ట్యాంకు వద్దకు ఎవరు వెళ్లినా, నీటిని కలుషితం చేసినా, పోలీస్‌ కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయిస్తామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పది సంవత్సరాలుగా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హంద్రీనీవా జలాలను సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు, పుంగమ్మ చెరువుకు విడుదల చేశారని తెలిపారు. ఈ నీటిని ఫిల్టర్‌హౌస్‌లకు పంపి, శుద్ధి చేసి పట్టణ ప్రజలకు కొళాయిల ద్వారా మంచినీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండా పట్టణ ప్రజలు ప్రతి రోజు సమ్మర్‌స్టోరేజ్‌ట్యాంకుపైకి వెళ్లి విన్యాసాలు చేయడం, ఈతలు కొట్టి అక్కడ మధ్యం సేవించడం , బిరియానిలు తిని నీటిలో పడేసి కలుషితం చేస్తున్నారని, పైపులైన్ల ద్వారా వచ్చే నీటి వేగంలో పిల్లలు, మహిళలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇలా కలుషితమైన నీటిని ప్రజలకు ఎలా సరఫరా చేయగలమని ప్రశ్నించారు. గత వారం రోజులుగా ప్రజలకు మున్సిపల్‌ సిబ్బందిచే అనేక విధాలుగా హెచ్చరికలు చేసినా ప్రజల్లో మార్పు రాకపోవడం బాధకరమన్నారు. దీనిపై సీఐ గంగిరెడ్డితో చర్చించడం జరిగిందన్నారు. సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు ప్రాంతంలో పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బందిచే పహారా ఏర్పాటు చేసి, మైకుల ద్వారా హెచ్చరికలు చేపట్టామన్నారు. అలాగే పట్టణంలోని ప్రజలకు కూడ మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని పట్టణ ప్రజలు జాగ్రత్తగా గమనించి తమ పిల్లలను కూడ ఆ ప్రాంతానికి పంపరాదని తెలిపారు. నిషేధిత ప్రాంతంలోకి ఎవరు వెళ్లినా పోలీస్‌ కేసులు నమోదు చేస్తామని, అక్కడికి తీసుకెళ్లే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

లారీ ఢీకొని విరిగిపడిన విద్యుత్‌  ట్రాన్స్ ఫార్మర్

Tags: Prohibitions at the Summer Storage Tank

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *