ఢిల్లీ అల్లర్ల వెనుక ఉగ్రవాదుల హస్తం

Date:26/02/2020

ఆదిలాబాద్ ముచ్చట్లు:

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల వెనుక తీవ్రవాదులు, ప్రతిపక్షాల హస్తం ఉన్నదని బీజేపీ నాయకుడు, కృష్ణ గోదావరి నది జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్ ఢిల్లీలో బస చేసిన నాడే హింసను ప్రేరేపించి అల్లర్లు చేయడం దేశ ప్రతిష్టను దిగజార్చే కుట్రగా ఆయన అభివర్ణించారు.పోలీసులను చంపడం వెనుక కూడా దారుణమైన కుట్ర కోణం ఉందని ఆయన అన్నారు. పౌరసత్వ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అదే విధంగా అల్లర్లను దేశ హిందూత్వ వ్యతిరేక నినాదాలు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వాన్ని అస్థిర పాలు చేయటానికి కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు.

 

 

 

ఏది ఏమైనా ఈ కుట్రదారులను వెంటనే పట్టుకొని దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించి దేశంలో శాంతి సౌభాగ్యాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుందని గుర్తించాలని కోరుతున్నానని అన్నారు.నిరసనలు కేవలం నిరసన లాగా చేయాలి తప్ప ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ రోడ్లను దిగ్బంధించడం కాదని ఆయన తెలిపారు. పౌరసత్వ చట్టంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో దీన్ని అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. దీన్ని వ్యతిరేకించిన కెసిఆర్ రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని రాంనాథ్ అన్నారు.

2021 నాటికి పోలవరం పూర్తి

Tags: Terrorists’ hand behind the Delhi riots

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *