.చంద్రశేఖర్ ఆజాద్ 89వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పీవైఎల్-పీ.డీ.ఎస్.యూ నాయకులు

Date;27/02/2020

.చంద్రశేఖర్ ఆజాద్ 89వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పీవైఎల్-పీ.డీ.ఎస్.యూ నాయకులు

భారత జాతీయోద్యమ పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ 89 వ వర్ధంతి సందర్భంగా పీవైఎల్-పీ.డీ.ఎస్.యూ ఆధ్వర్యంలో కుమార్ నారయణ భవన్ లో ఆయన చిత్రపటానికి

పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, పీ.డీ.ఎస్.యూ ఆర్మూర్ ఏరియా  ప్రధాన కార్యదర్శి నిఖిల్ లు మాట్లాడుతు బ్రిటిషర్ల

వలస పాలన కు వ్యతిరేకంగా చంద్రశేఖర్ ఆజాద్ పిన్న వయసులోనే పోరాటంలో పాల్గొని భారత స్వాతంత్ర్యం కోసం పాతికేళ్ల ప్రాయం లోనే తన ప్రాణాలు అర్పించారని అటువంటి పోరాట

యోధుని స్పూర్తి తో నేటి విద్యార్థి, యువతరం దేశం లో జరుగుతున్న మత విద్వేషాలకు వ్యతిరేకంగా, స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్న పాలకుల విధానాలకు

వ్యతిరేకంగా పోరాడుదామని అన్నారు…భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, బిస్మిల్,అప్షల్ ఖాన్ ల సహచరుడైన ఆజాద్ చంద్రశేఖర్ ఉరిశిక్ష కు గురైన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లను

విడిపించేందుకు ఆల్ప్రెడ్ పార్క్ లో వ్యూహ రచన సమావేశం చేస్తున్న సందర్భంలో మాటు వేసిన పోలీసులను తన రివాల్వర్ తో కాల్పులు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా

చివరకు ఒకే తూటా మిగలడం తో బ్రిటిష్ వారి చేత చావడం ఇష్టం లేని ఆజాద్ తానే కాల్చుకుని ఆత్మహుతి కి పాల్పడ్డాడని అన్నారు..ఆనాడు స్వతంత్రం కోసం కులం, మతం అనే తేడా

లేకుండా భారతీయులుగా ఉద్యమించి ఈ దేశాన్ని వలస పాలన నుండి విముక్తి చేస్తే ఆనాడు పోరాటం లో పాల్గొనకుండా బ్రిటిషర్ల కు క్షమాపణలు చెప్పి వాళ్లకు తొత్తుగా ఉన్న సవార్కర్ కు,

గాంధీ ని చంపిన గాడ్సే లకు వారసులైన ఆరెస్సెస్ బీజేపీ లు తామేదో గొప్ప దేశభక్తులైనట్లు నటిస్తూ ఈ దేశం లో కలిసి ఉన్న ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల ఐక్యత ను

విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్న వారి ఎత్తుగడలను ఆజాద్ చంద్రశేఖర్ స్పూర్తి తో చిత్తు చేద్దాం అని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో  పీవైఎల్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి నిఖిల్,

పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ , శ్రీనివాస్,  యుగంధర్, రాజ్ మహ్మద్, పీ.డీ.ఎస్.యూ ఆర్మూర్ ఏరియా ఉపాధ్యక్షులు సాయి కుమార్, సహాయ కార్యదర్శి దయాకర్, కోశాధికారి ఈశ్వర్,

అజయ్,సాయితేజ తదితరులు పాల్గొన్నారు

TagsPVL-PDSU leaders paid tribute on the 89th anniversary of Chandrashekhar Azad;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *