ఆక్సిజన్ ప్లాంట్ శాశ్వత ప్రాతిపదికన టీటీడీ ఏర్పాటు చెయ్యాలి.

0 23

EO కి టీటీడీ ఉద్యోగసంఘాల JAC వినతి.

 

తిరుపతి  ముచ్చట్లు:

- Advertisement -

Covid19 వల్ల ప్రపంచ వ్యాప్తంగా మానవాళి అతలాకుతలం అయింది.ఇందులో టీటీడీ ఉద్యోగులు అనేకమంది దీని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.మరికొంతమంది తీవ్ర ఆరోగ్యసమస్యలు ఎదుర్కొన్నారు.ఈ విపత్తు నుండి ఉద్యోగుల్ని/ప్రజల్ని కాపాడాలనే సామాజిక బాధ్యతతో తన అకామిడేషన్ కేంద్రాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చి,వారికవసరం అయిన ఆహార సరఫరానుచేసింది.లాక్ డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి అన్న ప్రసాదాలు అందించి టీటీడీ తనగొప్ప దాతృత్వాన్ని చాటుకుంది.1st/2nd వేవ్ లో కరోనాకు గురైన ఉద్యోగులను కాపాడుకోవడానికి అహర్నిశలు కృషిచేస్తున్నది.ఉద్యోగులకు ప్రత్యేకంగా మాధవం క్వారంటైన్ కేంద్రంగాను,బర్ద్ హాస్పిటల్ ను ప్రత్యేకంగా ఉద్యోగులకు కోవిడ్ హాస్పిటల్ గా మార్చి దేశం అంతా ఆక్సిజన్ తో అల్లాడుతున్న పరిస్థితుల్లో టీటీడీ తన పలుకుబడితో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సిలండర్స్,విద్యుత్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు,ఆక్సిజన్ ట్యాంకర్ ను తెప్పించి ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకొని 24 గంటలూ కంటికిరెప్పలా తన బిడ్డల్ని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నది.ఇతర ప్రాంతాల్లోని ప్రయివేట్ ఆసుపత్రులందు చికిత్స పొందిన ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించింది.

 

 

 

ఈ సందర్బంగా ఆక్సిజన్ కోసం పాండిచ్చేరి,హైదరాబాద్,బళ్ళారి,నెల్లూరు,ఏర్పేడు ప్రాంతాలనుండి నిరంతరం ఆక్సిజన్ సిలండర్స్ కోసం రేయింబవళ్లు టీటీడీ అధికారుల నిరంతర పర్యవేక్షణలో ఉద్యోగులు చాలా వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లి తీసుకొని రావడం జరుగుతున్నది.టీటీడీ తన సామాజిక బాధ్యతగా ఇప్పటికే రాష్ట్రంలో అత్యుత్తమంగా బర్ద్ ,స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్నది.ఇవే కాకుండా అశ్వనిఆసుపత్రి,సెంట్రల్ హాస్పిటల్,SV ఆయుర్వేద ఆసుపత్రులను నిర్వహిస్తోంది.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నది.కరోనా లాంటి విపత్తులెదురైనపుడు ధీటుగాఎదుర్కోవడానికి టీటీడీ సంస్థ ద్వారా టీటీడీ ఆదీనంలోని హాస్పిటల్ లో ఆక్సిజన్
మనమే ఉత్పత్తి చేసుకొనే విధంగా ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని టీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులుమల్లారపనాగార్జున,గంపలవెంకటరణారెడ్డి,గోల్కొండవెంకటేశం, మేడికొండప్రసాదరావు,జాటోత్భాస్కర్,కట్టమంచిఇందిర,సానoరెడ్డికల్పన,పూజారిరత్నప్రభాకర్
కాటాగుణశేఖర్ కొమ్మారెడ్డెప్ప,, శ్రీలక్ష్మి,తలారిమహేష్ అమాసనాగరత్నం,V.వెంకటరమణ
ఆకులశేఖర్ లు కోరారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

 

Tags:The oxygen plant should set up the TTD on a permanent basis.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page