కరోనా పేషంట్లతో క్యారమ్స్ ఆడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

0 62

చంద్రగిరి ముచ్చట్లు:

 

ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. క్యారమ్స్ ఆడి.. క్రీడోత్సవాలను ప్రారంభిస్తున్నారు.. అని అనుకుంటే పొరబడినట్లే..!!

- Advertisement -

♦️చిత్తూరు జిల్లా చంద్రగిరి కోవిడ్ కేర్ ఆసుపత్రిలో కరోనా పేషంట్లతో క్యారమ్స్ ఆడుతూ ఔరా అనిపించారు.. పేషెంట్లలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.

♦️శనివారం ఉదయం కోవిడ్ కేర్ ఆసుపత్రి ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

♦️ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోవిడ్ కేర్ ఆసుపత్రి లో కరోనా పేషంట్లతో గడిపారు.

♦️కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అత్యంత ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమం.. డాక్టర్లే భయాందోళనలకు గురవుతున్న పరిస్థితుల్లో.. ధైర్యంగా కరోనా పేషంట్లను పరామర్శించడం, కోవిడ్ సెంటర్ లో సౌకర్యాల కల్పనపై పేషంట్లను ఆరా తీయడం, పేషంట్ల భుజం తట్టి ధైర్యం చెప్పడం వంటి సాహసో పేత నిర్ణయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు..

 

 

 

 

♦️కరోనా పేషంట్లు బస చేస్తున్న అన్ని వార్డులలో తిరిగి పరిశీలించారు. కోవిడ్ కేర్ కిట్టు.. అందులో మీకు ఉపయోగపడే 34 రకాల వస్తువులు ప్రతి ఒక్కరికీ అందాయా అని పేషంట్లను అడిగారు.

♦️ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో ప్రస్తుతం అందుతున్న ఆహారం ఎలా ఉంది..? డాక్టర్లు సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నారా..! పారిశుద్ధ్యం మెరుగ్గా ఉందా..!
ఇంకా ఏమైనా కావాలా..!! అంటూ కరోనా పేషంట్ల ను వాకబు చేశారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

♦️ చెస్ ఆడుతున్న కరోనా పేషంట్లతో కలిసి చెస్ ఆటను అడారు. అలాగే టీవీ చూసే పేషంట్లతో కలిసి వారితో సరదాగా ముచ్చటిస్తూ టీవీ చూశారు.

 

 

 

 

♦️ఇక్కడి ఏర్పాట్లతో తాము కోవిడ్ ఆసుపత్రికి వచ్చినామన్న ఆలోచనే లేకుందని కరోనా పేషంట్లు ఎమ్మెల్యేతో అన్నారు.

♦️అనంతరం కోవిడ్ ఆసుపత్రి డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందితో సమీక్షించారు.

♦️మీకు విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవచేసే అవకాశం రావడం అదృష్టంగా భావించాలన్నారు. కరోనా పేషెంట్లకు ఎటువంటి లోపం లేకుండా మెరుగైన సేవలు అందించాలని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కోరారు.

♦️కరోనా పేషంట్లు కూడా చెవిరెడ్డి ధైర్యాన్ని కొనియాడారు. అసలైన ప్రజానాయకుడు చెవిరెడ్డి అని సమర్థించారు. ప్రజా సంక్షేమానికి నిరంతరంగా పరితపించే నాయకుడు చెవిరెడ్డి అంటూ కితాబిచ్చారు.

 

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; MLA Dr. Chevireddy Bhaskar Reddy who seemed aura playing caroms with corona patients.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page