టిటిడి ఉద్యోగుల‌కు వేగంగా వ్యాక్సిన్ ప్ర‌క్రియ పూర్తి చేయాలి – టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

0 43

తిరుపతి ముచ్చట్లు:

 

టిటిడి ఉద్యోగుల‌కు వ్యాక్సిన్ ప్ర‌క్రియను త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం ఉద‌యం టిటిడి సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో వ‌ర్చువ‌ల్ మీటింగ్ నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఈవో బ‌ర్డ్ ఆసుప‌త్రి, ఆయుర్వేద ఆసుప‌త్రుల‌లో బెడ్లు, అక్సిజ‌న్‌, రోగుల‌కు అందుతున్న సౌక‌ర్యాలను అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల‌లో ఎంత మంది వ్యాక్సిన్ వేసుకున్నారు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఎప్ప‌టికి పూర్త‌వుతుంద‌నే విష‌యాల‌ను జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి వివ‌రించారు. తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యం, తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం వ‌స‌తి స‌ముదాయాలు, రైల్వేస్టేష‌న్ వెనుక వైపు ఉన్న రెండ‌వ, మూడ‌వ స‌త్రాల‌లో విధులు నిర్వ‌హించే పారిశుద్ధ్య కార్మికుల‌కు కోవిడ్ వ్యాక్సిన్‌ వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించిన కేసులు స్విమ్స్‌లో న‌మోదు అయ్యాయా అనే విష‌యంపై నివేదిక పంప‌వ‌ల‌సిందిగా స్విమ్స్ సంచాల‌కుల‌ను కోరారు.

 

 

 

 

- Advertisement -

బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో నూత‌నంగా ఏర్పాటు చేస్తున్న చిన్న పిల్ల‌ల ఆసుప‌త్రి ప‌సుల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో నిర్మిస్తున్న పై క‌ప్పు ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లో కాటేజిల ఆధునికీక‌ర‌ణ ప‌నులు ఆగ‌స్టులోపు పూర్తి చేయాల‌న్నారు.తిరుమ‌ల‌లో వివిధ విభాగాల్లో విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బందికి ఆన్‌లైన్ ద్వారా శిక్ష‌ణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి విభాగాధిప‌తిని ఆదేశించారు.
తిరుమ‌ల‌లోని ఉప విచార‌ణ కార్యాల‌యాల్లో సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని జెఈవోను కోరారు. అలిపిరిలో నిర్మాణంలో ఉన్న గో తులాభారం నిర్మాణాలను పూర్తి చేయాల‌న్నారు. హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్‌, స‌ప్త‌గిరి మాస ప‌త్రిక‌, త‌గిగొండ వెంగ‌మాంబ మెమోరియల్ పనులను సమీక్షించారు.
సిబ్బందిపై పెండింగ్‌లో ఉన్న డిఏ కేసులు, కారుణ్య నియ‌మ‌కాల గురించి జెఈవో వివరించారు.
తిరుమ‌ల‌లో ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలు, ఏడ‌వ మైలు వ‌ద్ద మొక్క‌ల పెంప‌కం, ఫెన్సింగ్ ఏర్పాటు ప‌నుల‌ను జూన్ నాటికి పూర్తి చేయాల‌న్నారు. రాబోవు ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి మందులు, పరికరాలు సెంట్ర‌ల్ ప్రొక్యూర్‌మెంట్ సెల్ ( కేంద్ర సేకరణ సెల్) ద్వారా కొనుగోలు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. శ్వేతలో కోవిడ్ కార‌ణంగా ఆగిన ఉద్యోగుల శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించాల‌ని సూచించారు.ఈ స‌మావేశంలో సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, సిఇ  ర‌మేష్‌రెడ్డి, ఎఫ్ ఎ అండ్ సిఎవో  బాలాజి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

 

Tags: TTD employees need to quickly complete the process of vaccine – TTD EO Dr keesjavaharreddi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page