పుంగనూరులో కరోనా మృతులకు అంతిమ సంస్కారం వారి సంస్కారం

0 233

– ఇప్పటి వరకు 209 అంత్యక్రియలు

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రేమ, ఆత్మీయతలను , బంధుత్వాలను ఆనవాలు లేకుండ చేస్తున్న కరోనా మహమ్మారి భారీన పడి మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలకు తాము ఉన్నామంటు పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పార్టీ యువకులు ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండ అంత్యక్రియలు నిర్వహించి, ప్రశంసలు అందుకుంటున్నారు. శనివారం పట్టణంలో మృతి చెందిన నలుగురికి అంత్యక్రియలు నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారిభారిన పడి వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఏ ప్రాంతం నుంచి అంత్యక్రియలకు సమాచారం అందగానే కరోనా వారియర్స్ చాంద్‌బాషా, జబివుల్లా, నజీర్‌, జమీర్‌, మెహబూబ్‌, మున్నా, సాదిక్‌, మునీర్‌, బావాజాన్‌, రిజ్వాన్‌ తదితరులు వెళ్లి చనిపోయిన వ్యక్తి మత సాంప్రదాయాల మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. బంధుమిత్రులు లేకపోయినా పాపులర్‌ఫ్రంట్‌ సభ్యులే కుటుంబ సభ్యులుగా మారిపోయి పాపులర్‌ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చాంద్‌బాషా మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో 86 మందికి అంత్యక్రియలు నిర్వహించామని , ఈ సారి ఇప్పటి వరకు 123 మందికి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. కరోనా తీవ్రంగా ఉందని , ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: Their funeral is for the corona dead at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page