పుంగనూరులో కరోనా రోగులకు అన్నిరకాల సదుపాయాలు – ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

0 39

– ఆసుపత్రి వద్ద 108 ఏర్పాటు
– సదుంలో కోవిడ్‌ ఆసుపత్రి

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

పుంగనూరు నియోజకవర్గ ప్రజలు కరోనా వ్యాదిన పడి ఇబ్బందులకు గురికాకుండ ఉండేందుకే పుంగనూరులో కోవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ తో కలసి ఆసుపత్రిని ప్రారంభించి, ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్‌ ఆసుపత్రిలో 80 ఆక్సిజన్‌ పడకలను , 5 వెంటిలేటర్లను , 50 ఆక్సిజన్‌ కాన్స్ట్రేటర్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 95 పడకలతో కోవిడ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే అత్యవసర సమయాల్లో కోవిడ్‌ రోగులను తరలించేందుకు 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వీటితో పాటు సదుం మండల కేంద్రంలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని , త్వరలోనే అక్కడ కూడ వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండ మనోధైర్యంతో ఉండాలన్నారు. ఎలాంటి అవసరమైనా తాము అండగా ఉంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ జహ్నవి, జేసిలు వీరబ్రహ్మం, రాజేశేఖర్‌, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, రెడ్డెప్ప, నాగభూషణం, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

 

 

కరోనా రోగులు తిరగరాదు…

కరోనా భారీన పడిన రోగుల ద్వారా 7 మందికి ఆ వ్యాది సోకుతోందని జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ తెలిపారు. హ్గం ఐసోలేషన్‌లో ఉండే రోగులు బయటకు రారాదన్నారు. వీరిని నియంత్రించేందుకు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు,ఆశవర్కర్లు, కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ సమస్యలు ఎదురైనా ఆప్రాంత ఉద్యోగులదే బాధ్యత అని , వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

ప్రైవేటు కేంద్రాలు సీజ్‌…

ప్రభుత్వ అనుమతి లేకుండ కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లను తక్షణమే సీజ్‌ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. మున్సిపాలిటిలో ప్రైవేటు వ్యాపారం జోరుగా సాగుతోందని ఫిర్యాదు చేయడంతో అలాంటి ల్యాబ్‌లను సీజ్‌ చేయాలని స్పష్టం చేశారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: All kinds of facilities for corona patients in Punganur – Minister Peddireddy inaugurated

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page