పుంగనూరులో ప్రతి కుటుంబాన్ని విచారించాలి -వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 198

పుంగనూరు ముచ్చట్లు:

 

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంభాన్ని విచారించి, వారి ఆరోగ్య స్థితి గతులపై నివేదికలు సిద్దం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచించారు. శనివారం మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, ఎంపిటిసిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అందరు తమ ప్రాంతాల్లోని ప్రతి కుటుంభాన్ని సందర్శించి, వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులతో కలసి సందర్శించాలన్నారు. అలాగే కర్ఫ్యూ నిబంధనలను వివరించి, కరోనా భారీన పడిన వారికి ప్రభుత్వంతో పాటు మంత్రి పెద్దిరెడ్డి అందిస్తున్న సేవలను వివరించాలన్నారు. ఆనారోగ్యంతో ఉన్న వారిని తక్షణమే కోవిడ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించాలన్నారు. నిర్లక్ష్యం వహించడం మంచిదికాదని సూచించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి , మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ జిల్లా జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; Every family in Punganur should be prosecuted – YSRCP state secretary Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page