పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

0 569

-24 గంటలు గడిచిన మార్పు శూన్యం
– నామమాత్రంగా పర్యటనలతో ఒరిగేదేమి..?

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

కరోనా బాధితులకు సేవలందించాలని , ప్రజాప్రతినిధులు అందరు తమ ప్రాంతాలలో పర్యటించి రోగుల బాగోగులు తెలుసుకోవాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నడు లేని విధంగా తీవ్ర ఆవేదనకు లోనై, పుంగనూరులో ప్రజాప్రతినిధులను తీవ్రంగా మందలించారు. మంత్రి పెద్దిరెడ్డి మందలించి 24 గంటలు గడిచినా స్థానిక ప్రజాప్రతినిధులు కొంత మంది మాత్రం వార్డులు, గ్రామాల్లో పర్యటించారు. మిగిలిన వారు ఆఫీసుల్లో మీటింగ్‌లకు పరిమితమైయ్యారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు నాయకులు వెళ్లాల్సింది పోయి మీటింగ్‌లు పెట్టుకుంటే ….కరోనా తగ్గిపోతుందా….మాకు (కరోనా రోగులకు) వచ్చేలాభం ఏమిటని ప్రజలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటి 31 వార్డులలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ , ముగ్గరు కోఆఫ్షన్‌ మెంబర్లు ఉన్నారు. అలాగే మండలంలో 23 మంది సర్పంచ్‌లు ఉన్నారు. ఎంపీటీసీలు, జెడ్పిటిసి ఏకగ్రీవమైనారు. వీరిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు కొంత మంది కౌన్సిలర్లు మాత్రమే వార్డుల్లొకి వెళ్లారు. మిగిలిన వారు ప్రజల కష్టాలు తెలుసునేందుకు వెళ్లకపోవడం బాధకరం. ఉదయం 10 గంటల తరువాత కర్ఫ్యూ ఉండటంతో నేతలు, ప్రజాప్రతినిధులు తిరిగి ఆదివారం ఉదయం వస్తారని ప్రజలు ఎదురుచూడాల్సిందేనా…?

 

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; Leaders at the meeting after Minister Peddireddy reprimanded them in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page