పుంగనూరు ఆర్టీసి డిపోలో వ్యాక్సినేషన్‌

0 69

పుంగనూరు ముచ్చట్లు:

నూతనంగా ప్రారంభించిన పుంగనూరు ఆర్టీసి డిపోలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని డిపో మేనేజర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రెడ్డికార్తీక్‌ తన సిబ్బందితో కలసి కార్మికులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్‌ మాట్లాడుతూ కార్మికులు , వారి కుటుంబాలతో పాటు ప్రయాణికులకు ఎలాంటి అపాయము కలగకుండ ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని డిపోలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కరీముల్లా, చంద్ర, సీఎం.బాషా, దిలిప్‌, కుమార్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: Vaccination at Punganur RTC Depot‌

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page