పుంగనూరు ప్రజల ఆరోగ్యాన్ని గుర్తించి సేవలు అందించాలి-నేతలకు మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక

0 71

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ప్రజల వద్దకు వెళ్లి వారికి సేవలు అందించడం అలవర్చుకోవాలని , ఈ విషయంలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మంచిది కాదని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మందలించారు. శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి రెడ్డెప్ప, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి , కలెక్టర్‌ హరినారాయణ్‌తో కలసి కోవిడ్‌ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కరోనా భారిన పడి ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని గమనించి , నియోజకవర్గానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి, ఆక్సిజన్‌ సిలిండర్లు, పడకలు ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్యమే పరమావదిగా ప్రభుత్వం అందిస్తున్న సేవలతో పాటు తాము సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కాని మున్సిపాలిటి, మండల ప్రజాప్రతినిధులు అందరు ఏకగ్రీవంగా గెలుపొందడంతో ప్రజల కష్టాలు, ఓటర్ల విలువ తెలియకుండ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రజాప్రతిన్యిధులు , పార్టీ నాయకులు గ్రామాల్లో, వార్డుల్లో పర్యటించి, ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి తమకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అలాగే కరోనా నిబంధనలను ప్రజలకు వివరించాలని , కర్ఫ్యూ నిబంధనలను ఖచ్చితంగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ఎవరి నిర్లక్ష్యం కనపడరాదని హెచ్చరించారు. ఈ విషయంలో తాను ఇక మాట్లాడటం ఉండదని , జాగ్రత్త అంటు మందలించారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, నాగభూషణం, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు , పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: Punganur should recognize the health of the people and provide services-Minister Peddireddy warns the leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page