పుంగనూరు మున్సిపాలిటిలో కఠిన ఆంక్షలు అమలు – కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 357

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటిలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటంతో నియంత్రించేందుకు ఆదివారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చైర్మన్‌ అలీమ్‌బాషాతో పాటు వ్యాపారులు, డాక్టర్లు, పట్టణ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ఉదయం 10 గంటల నుంచి కర్ఫ్యూను అమలు చేయడం జరుగుతుందన్నారు. అలాగే టీ స్టాల్స్, పానీపూరి సెంటర్లు, కబాబ్‌సెంటర్లను ఈనెల 30 వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. వ్యాపార విషయాల్లో చైర్మన్‌, ఆయా కౌన్సిలర్లు తమ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే జ్వరపీడిత బాధితులను గుర్తించి కోవిడ్‌ సెంటర్లకు, లేదా హ్గం ఐసోలేషన్‌లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ముఖ్యంగా పట్టణానికి వచ్చే వారు తమ ఆనారోగ్య విషయమై మెడికల్‌షాపుల్లో మందులు కొనుగోలు చేస్తారని, దీని ద్వారా కరోనా ప్రభలే అవకాశం ఉందన్నారు. జ్వరపీడిత బాధితులు వచ్చిన వెంటనే వారిని చైతన్య పరచి, కోవిడ్‌ పరీక్షలకు తరలించాలని, అలాంటి వారి చిరునామ సేకరించి మున్సిపాలిటికి అందజేయాలన్నారు. అలాగే డాక్టర్లు కరోనా పరీక్షల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తే సీజ్‌ చేస్తామన్నారు. మానవత్వంతో తక్కువ ఫీజులతో పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా నియంత్రణకు సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను సీజ్‌ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సభలు, సమావేశాలకు అనుమతులు లేవన్నారు. ఈ విషయమై ఎవరు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

 

Tags: Enforcement of strict sanctions in Punganur Municipality – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page