పెళ్లికి ఒప్పుకోలేదని బీరు బాటిల్ తో గొంతులో పొడిచాడు

0 41

నల్లగొండ ముచ్చట్లు:

పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి నీ బీరు బాటిల్ తో గొంతులో పొడిచి హత్య చేసిన ఘటన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన వెలుగు అంజ య్యా, రాములమ్మ దంపతుల చిన్న కుమార్తె చందన(20) ఇంటర్ దాకా చదివి కూలి పనులకు వెళుతోంది. అనుముల మండలం కొరివెనిగుడెనికి చెందిన బొడ్డు శంకర్ ఇంటర్ చదివి వరికోత మిషన్ నడుపుతున్నాడు. వరికోతల నిమిత్తం ఒకరోజు శంకర్ బొల్లారం వెళ్ళాడు. ఆ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రోజు కలుసుకునే వారు. ఈ క్రమంలో ఒక రోజు శంకర్ పెళ్లి ప్రస్తావన తీసుకు రాగా చందన నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ బీరు బాటిల్ తో ఆమె గొంతులో పొడిచాడు. బండరాయితో తలపై మో దడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

 

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; He stabbed her in the throat with a bottle of beer for not agreeing to the wedding

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page