మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

0 38

Date:22/05/2021

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శ‌నివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో అభయమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో విషంతోపాటు అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంలో సాక్షాత్కరించారు. సమ్మోహనమైన ఆమె చూపులకు అసురులు పరవశులైపోయి ఉండగా , దేవతలకు అమృతం అనుగ్రహించ‌డం జరిగింది.

 

 

అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేశారు.కాగా, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు గ‌రుడ‌వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఏఈవో  ర‌వికుమార్‌‌ రెడ్డి, కంక‌ణ బ‌ట్టార్  ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్‌ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ మునీంద్ర‌బాబు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

మహేష్‌బాబు భావోద్వేగం

Tags: Sri Govindarajaswami in the incarnation of Mohini

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page