చౌడేపల్లి లో శానిటైజర్లు,మాస్క్ లు పంపిణీ చేసిన సర్పంచ్ భాగ్యవతి.

0 86

చౌడేపల్లి ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గడ్డంవారిపల్లి గ్రామ పంచాయతి కరోనా కట్టడికి కృషిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు ,వాలంటీర్లకు,ఏయన్ యం లకు ఆశా కార్యకర్తలకు మాస్క్ లు ,శానిటైజర్లు,గ్లౌస్ లు పంపిణీ చేసిన గడ్డంవారిపల్లి సర్పంచ్ భాగ్యవతి . ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిదిగా చౌడేపల్లి మండల అభివృద్ది అధికారి వెంకటరత్నం గారు విచ్చేశారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ భాగ్యవతి మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా కట్టడికి నిరంతరము కృషి చేస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్ల.ఆశ కార్యకర్తలు,వాలంటీర్లు సేవలకు వెలకట్టలేమని,వారు తమ స్వార్థం చూసుకోకుండా ,ప్రజా సేవలో ముందున్నారని కావున వారి ఆరోగ్యం కూడా బాగుండాలని ,వారు బాగుంటేనే మన పంచాయతీకి సేవలు అందించగలని వారిని అభినందిస్తూ వాళ్ళకు తగు సలహాలు ,సూచనలు ఇస్తూ వాళ్ళుకు రక్షణ కవచాలైన శాని టైజర్లు ,మాస్క్ లు,గ్లౌస్ లు ,మెడికల్ కిట్లు పంపిణీ చేయడమైనదని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ది అధికారి చేతుల మీదుగా శానిటైజర్లు,మాస్క్ లు ,మెడికల్ కిట్లు . గ్లౌస్ లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో యం.పి.డి.ఓ. సర్పంచ్ లతో పాటు గా ఆరోగ్య ఉపకేంద్రం యం.యల్ హెచ్ సి.స్వాతి నాయకులు ,రెడ్డప్పరెడ్డి,,హరినాథ్ ,యం.పి.టి.సి.శ్రీరాములు,వార్డుసభ్యులు గిరిబాబు,ఏయన్ యం,ఆశ కార్యకర్తలు ,వాలంటీర్లు,గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; Sarpanch Bhagyavati distributed sanitizers and masks.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page