కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శన వేళలు మార్పు-ఈవో వెంకటేశు

0 69

కాణిపాకం ముచ్చట్లు :

 

సత్య ప్రమాణాలకు కొలువైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నదని కోవిడ్ నిబంధనల మేరకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శన వేళలు మార్పు చేసినట్లు ఆలయ ఈవో వెంకటేష్ పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని మిగిలిన స్వామి వారి నిత్య కైంకర్యాలను యధావిధిగా ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే స్వామి వారి ఇ ప్రత్యక్ష సేవలు పాల్గొనలేని భక్తులు పరోక్షంగా సేవలో పాల్గొనవచ్చని స్వామి వారి కళ్యాణం పాలాభిషేకం గణపతి హోమం సేవలకు ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించి నట్లైతే వారి గోత్రనామాలతో ఆర్జిత సేవలను నిర్వహించి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి సన్నిధిలో పూజలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోన మహమ్మారి తగ్గుతున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి కూడా భక్తులు ఆసక్తి చూపుతున్నారని ఆలయ ఈవో వెంకటేష్ పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Varasiddhi Vinayaka Swami is the epitome of truth

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page