తమిళనాడు రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షం కురిసే అవకాశo

0 45

చెన్నై ముచ్చట్లు :

 

తమిళనాడు రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షం కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం తూర్పు, మధ్య బంగాళాఖాతం అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది.ఇది క్రమక్రమంగా బలపడి ఈనెల 24వ తేదీ నాటికి తుపానుగా మారి ఉత్తర వాయువ్య దిశగా పయనించి 27వ తేదీ ఒడిశా-పశ్చిమబెంగాల్‌ తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ కారణంగా రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, సోమవారం నుంచి ఐదు రోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి.ఇదిలా వుండగా, కన్నియకుమారి జిల్లాలో శనివారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.మామిడి, కొబ్బరి, సపోట, అరటి తోటల్లో కాయలు రాలడంతో రైతులకు నష్టం ఏర్పడింది.అలాగే, దిండుగల్‌, తేని, నీలగిరి జిల్లాల్లో ఆదివారం నుంచే వర్షాలు కురుస్తాయని, పుదుచ్చేరిలో తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Chance of rain in Tamil Nadu for the next five days

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page