ధ్వజారోహణంతో ప్రారంభమైన నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

0 44

తిరుపతి ముచ్చట్లు :

 

నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య మిథున‌ లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు.అనంతరం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.కాగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పార్వ‌తి,ఏఈవో దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌  సాతేనాయ‌క్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  నాగ‌రాజు,ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

- Advertisement -

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు :

తేదీ23-05-2021

ఉదయం – ధ్వజారోహణం

సాయంత్రం – పెద్దశేష వాహనం

24-05-2021

ఉదయం – చిన్నశేష వాహనం

సాయంత్రం – హంస వాహనం

25-05-2021

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

26-05-2021

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం

27-05-2021

ఉదయం – మోహినీ అవతారం

సాయంత్రం – గరుడ వాహనం

28-05-2021

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – గజ వాహనం

29-05-2021

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

30-05-2021

ఉదయం – రథోత్సవం బ‌దులు సర్వభూపాల వాహనం

సాయంత్రం – క‌ల్యాణోత్స‌వం, అశ్వవాహనం

31-05-2021

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:Kalyana Venkateswaraswamy Brahmotsavalu with Narayanavanam Sri Padmavati which started with flag hoisting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page