పుంగనూరు కోవిడ్‌ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం – డిఎంఅండ్‌ హెచ్‌వో డాక్టర్‌ శ్రీహరి

0 238

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని కోవిడ్‌ ప్రభుత్వాసుపత్రిలో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ శ్రీహరి తెలిపారు. ఆదివారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీహరి చిత్తూరు ఎంపి రెడ్డెప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఎంపితో కలసి కోవిడ్‌ కేంద్రాన్ని, కోవిడ్‌ ఆసుపత్రిని పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్‌ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యపరికరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. అలాగే సదుం మండల కేంద్రంలో కూడ కోవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాధిగ్రస్తులు నిబంధనల మేరకు బయట తిరగరాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రోగి ద్వారా 7 మందికి సోకుతోందని తెలిపారు. వీటిని నియంత్రించేందుకు మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటించి, బయట తిరగడం మానుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేలుపట్ల బాలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Quality treatment at Punganur Kovid Hospital – DM&HO Dr. Srihari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page