భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మేలో 12వ సారి పెంపు

0 33

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి.ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరగా.మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరోసారి పెంచాయి.ఇంతకు ముందు శుక్రవారం ధరలు పెరగ్గా.. ఒక రోజు విరామం తర్వాత తాజాగా ఆదివారం పెట్రోల్‌పై లీటర్‌కు 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వరకు పెంచాయి.కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.21, డీజిల్ రూ.84.07కు చేరింది.ఆర్థిక రాజధాని ముంబై నగరంలో దాదాపు వందకు చేరువైంది.లీటర్‌ పెట్రోల్‌ రూ.99.49, డీజిల్‌ రూ.91.30కు పెరిగింది.చెన్నైలో పెట్రోల్‌ రూ.94.86 డీజిల్‌ రూ.88.87, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.27, డీజిల్‌ రూ.86.91, హైదరాబాద్‌లో రూ.96.88, డీజిల్‌ రూ.91.65, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.99.68, డీజిల్‌ రూ.92.78కు చేరాయి.మే నెలలో ఇప్పటి వరకు 12 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.81, డీజిల్‌పై రూ.3.34 పెంచాయి.పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Falling petrol and diesel prices for the 12th time in May

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page