పుంగనూరులో ఇంటింటికి వెళ్లి ప్రజల భాగోగులు చూస్తాం-ఫకృద్ధిన్‌షరీఫ్‌

0 197

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా మహమ్మారి భారీన పడకుండ ప్రజలను చైతన్యపరస్తూ ఇంటింటికి వెళ్లి వారి భాగోగులను పరిశీలిస్తామని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని రహమత్‌నగర్‌, చెంగలాపురం వార్డుల్లో కౌన్సిలర్లు డి.షాహిదాబేగం, ఎస్‌.సాజిదాబేగంతో కలసి ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు అందరు ఆయా వార్డుల్లో పర్యటించి, ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మంత్రి ఆధ్వర్యంలో అందిస్తున్న వైద్య సేవలను వివరించి, కరోనా బాధితులను కోవిడ్‌ ఆసుపత్రులకు , కోవిడ్‌ సెంటర్లకు తరలించాలన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు   ధరించి, భౌతికదూరం పాటిస్తూ , కరోనా నియంత్రణకు కృషి చేయాలని కోరారు. ఈయన వెంట మైనార్టీ నాయకులు మహబూబ్‌బాషా, మైనార్టీ మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Let’s go house to house in Punganur and see the parts of the people-Fakhruddin Sharif

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page