పుంగనూరులో కరోనా నియంత్రణలో బిజి…బిజి…

0 291

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రజలు కరోనా భారీన పడకుండ చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించడంతో ప్రజాప్రతినిధులు పర్యటనలు ముమ్మరం చేశారు. సోమవారం చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, ఆ కౌన్సిలర్లు కలసి ఇంటింటికి వెళ్లి జ్వరాల సర్వే నిర్వహించారు. అలాగే వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. చైర్మన్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటిలోని సభ్యులకు పరీక్షలు నిర్వహించి , జ్వరాలు, ఇతర వ్యాదులు ఉన్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ, కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ సూచించారు. ఈ పర్యటనలో కౌన్సిలర్లు భారతి, నరసింహులు, శ్రీనివాసులు, అమ్ము, మనోహర్‌, రాఘవేంద్ర, రేష్మా, రెడ్డెమ్మ, కాళిదాసు, అర్షదఅలి, వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఏఎన్‌ఎంలు , ఆశవర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: BG … BG … under corona control in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page