పుంగనూరులో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలకు భవనాలు పరిశీలన

0 47

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరులో త్వరలో ప్రారంభించనున్న వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించేందుకు సోమవారం భవనాలు పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పిఏ మునితుకారం ఆధ్వర్యంలో మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి కలసి పట్టణంలోని పలు భవనాలను పరిశీలించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పాలిటెక్నిక్‌ కళాశాలను ఈ ఏడాది ప్రారంభించాలని ఆదేశించడంతో భవనాల పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ , మాజీ చైర్మన్‌ నాగభూషణం, వైఎస్‌ఆర్‌ మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Inspection of buildings for Agricultural Polytechnic College at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page