రుయా కార్మికుల సమస్యలు పరిష్కరించండి

0 41

-రుయా సూపరింటెండెంట్ కు సిఐటియు వినతి

 

తిరుపతి ముచ్చట్లు :

 

- Advertisement -

రుయాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, సోమవారం ఉదయం రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతికి సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ చంద్రశేఖర్, నోడల్ అధికారి డాక్టర్ మురళీకృష్ణల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ పెండింగ్ లో వున్న జీతాలను తక్షణం చెల్లించాలని, ప్రతి నెల ఐదవ తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని కోరారు. జీతాల్లో కోత విధించకుండా సక్రమంగా ఇవ్వాలని, ‘పే’ స్లిప్స్ ప్రతి నెలా ఇవ్వాలని అన్నారు. మహిళా కార్మికులకు దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతికి ప్రత్యేక గదులు కేటాయించాలని కోరారు. కోవిడ్ కేంద్రంలో పని చేస్తున్న కార్మికులకు అదనంగా జీతాలు చెల్లించాలని కోరారు. పెండింగ్ పి.ఎఫ్ సమస్యలకు కాలయాపన చేయకుండా పరిష్కరించాలని కోరారు. సూపరింటెండెంట్ డాక్టర్ భారతి వివరణ ఇస్తూ మహిళా కార్మికులకు దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతికి వెంటనే గదిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ‘ఏ’ వన్ కాంట్రాక్టర్ ఇన్ చార్జీ భాస్కర్ ను పిలిచి పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలనీ ఆదేశించారు. జి.ఓ. ఆధారంగా జీతాలు ఇవ్వటానికి తగు చర్యలు తీసుకొంటామని భారతి సిఐటియు నాయకులకు హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సిఐటియు నాయకులు టి.సుబ్రహ్మణ్యం, లక్ష్మీ, రుయా కార్మిక సంఘం నేతలు నాగిని, సులోచన, లీలావతి, సుశీల, విజయశాంతి, రాణెమ్మ , పద్మ , మాణిక్యం. భాషా, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:Solve the problems of Rua workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page