శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

0 27

తిరుచానూరు ముచ్చట్లు :

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా వ‌సంతోత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటల నుండి పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారంపుతోటలో పుట్టమన్ను సేకరించారు.మే 25 నుండి 27వ తేదీ వ‌ర‌కు మూడు రోజులపాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలో అమ్మ‌వారిని ఊరేగిస్తారు. ఈ కార‌ణంగా మే 26న స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వానికి బ‌దులుగా తిరుచ్చి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో క‌స్తూరిబాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌  మ‌ల్లీశ్వ‌రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Scientifically the beginning of Sri Padmavati Ammavari Vasanthotsava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page