25న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 291వ జయంతి

0 29

తిరుమల ముచ్చట్లు :

 

శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి అపరభక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 291వ జయంతి ఉత్సవం మే 25న తిరుమలలో జరుగనుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో, తిరుమల వెంగ‌మాంబ బృందావ‌నంలో, తిరుపతి అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఏకాంతంగా పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంట‌ల నుండి ఉభయనాంచారులతో కూడిన శ్రీమలయప్ప స్వామివారిని ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేప‌డ‌తారు. అనంత‌రం ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఏకాంతంగా వెంగ‌మాంబ జ‌యంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

 

 

 

 

- Advertisement -

శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు.   రాఘవేంద్రస్వామి,   వీరబ్రహ్మేంద్రస్వామి వారి లాగా తన బృందావనంలోనే 1817వ సంవ‌త్స‌రంలో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Vengamamba 291st birth anniversary on the 25th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page