ఉచిత అంతిమయాత్ర…అంబులెన్స్ ఏర్పాటు చేసిన జిహెచ్‌ఎంసీ

0 23

హైదరాబాద్  ముచ్చట్లు :

 

గ్రేటర్ పరిధిలో ఉచితంగా అంబులెన్స్ సర్వీసులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైన తర్వాత వేల సంఖ్యలో మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు లక్షల రూపాయలను దోచుకున్నారు. రెండు నెలలుగా ఈ దోపిడీ జరుగుతున్నా, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహించింది. చివరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉచితంగా గ్రేవ్ యార్డు వరకూ తరలిచేందుకు 14 అంబులెన్స్ లను ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ప్రకటించారు. అంతిమ యాత్ర రథాలుగా పిలిచే ఈ అంబులెన్స్ సర్వీసులను ఉపయోగించుకునేందుకు సర్కిళ్ల వారీగా ఇన్ చార్జీలను నియమించారు. మరణించిన వారిని ఇండ్లు, ఆస్పత్రుల నుంచి శ్మశాన వాటికలకు ఈ రథాలు ఉచితంగా చేర్చుతాయని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

ఫ్రీ అంబులెన్స్ సేవలు

జోన్ – కాంటాక్ట్ నెంబర్లు
ఎల్ బీ నగర్ – 9100091941, 9701365515
చార్మినార్ – 9440585704, 9849907742
ఖైరతాబాద్ – 7995009080
కూకట్‌పల్లి – 7993360308, 9515050849
శేరిలింగంపల్లి – 6309529286,9989930253
సికింద్రాబాద్ – 7993360302,9100091948

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Free funeral … GHMC arranged by ambulance

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page