ఒక పోలీసు ఆవేదన

0 46

హైదరాబాద్‌ ముచ్చట్లు:

పగలంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నా.. ఏ క్షణాన ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదు.. నా వలన ఇంట్లో కుటుంబానికి ఇబ్బంది అవ్వొచ్చు.. ఈ ఉపద్రవం నుండి బయట పడే వరకు ఇంటికి రాను.. ఎక్కడో ఒక చోట ఉంటా.. దొరికింది ఏదో తినేస్తా.. మీరు జాగ్రత్తగా ఉండండి అని నా సతీమణితో అంటే నాతో పెద్ద యుద్ధమే చేసింది. ఎక్కడ ఉంటావ్.. ఏమి తింటావ్. వద్దు ఇంటికి రావాల్సిందే అని. ఇక తప్పలేదు. పొద్దునే ఎప్పుడో పోతున్నాం.. వేసవి కాల ఎండ వేడికి, చెమటకి మాస్క్లు, చేతి గ్లౌజ్ లు తడిచిపోయి మంట పడుతున్నా భరిస్తున్నాం. తిరిగి ఎప్పుడో అర్ధరాత్రి వచ్చే ముందు ఇంటికి ఫోన్ చేసి వేడి నీళ్లు బయట పెట్టి మీరు అందరూ ఇంట్లోకి వెళ్లిపోండి అని. ఏ అర్ధరాత్రి అయినా వెనుక వైపు నుండి వచ్చి బయటనే బట్టలు అన్ని తీసేసి dettol నీళ్లలో ముంచి, నా ఫోన్, వాచీ,మాస్క్, కళ్ళజోడు, పర్స్, బండి కీ తో సహా అన్నింటిని శానిటైజర్ తో శుభ్రం చేసుకుని dettol నీళ్లతో స్నానం చేసి భయం భయంగా ఇంట్లోకి వెళ్లినా డాడీ అంటూ వచ్చిన నా 5 సం. కొడుకుని ఎత్తుకోలేని పరిస్థితి.. వద్దు నాన్న దగ్గరకు రాకు అని ఆ పసి మనసుని గాయ పరచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ ముద్ద తిని వారికి విడిగా దూరంగా పడుకుని పొద్దునే లేచి డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. ఇంతా చేస్తున్నా నాకు బాధగా లేదు. ఈ విపత్కర పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన ప్రజల్ని రక్షించుకోవాలి. నా ప్రజలు బాగుండాలి, నా దేశం బాగుండాలి అని ఎంత కష్టమైనా ఇష్టంగా పని చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. వీలైనంత వరకూ బయటకు రావడానికి ప్రయత్నించకండి, ఒక వేళ రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి.. సామాజిక దూరం పాటించండి. పోలీసు వారికి సహకరించండి. మీరు బాగుంటే మేము బాగున్నట్టే.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: A police officer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page