మలుపు తిరిగిన కర్నాటక మాజీమంత్రి రాసలీలల సీడీ కేసు..!

0 79

– ఆమె నాకు‌ముందే తెలుసంటున్న మాజీమంత్రి

 

కర్ణాటక ముచ్చట్లు:

 

- Advertisement -

కర్ణాటకలో దుమారం రేపిన మాజీమంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసులో మరో మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ బాధిత యువతి తనకు పరిచయం లేదని చెప్పిన మాజీ మంత్రి.. ఇప్పుడు ఆమె తనకు తెలుసని అంగీకరించినట్లు సమాచారం.సిట్ విచారణలో ఆయన తనకు యువతితో పరిచయం ఉందని, ఇద్దరం ఏకాంతంగా గడపడానికి మాట్లాడుకున్నట్లు చెప్పినట్లు తెలిసింది. అయితే ఆమె వీడియోలు తీసి బహిర్గతం చేసిందని వాపోయారు. యువతి తరఫు న్యాయవాది జగరదీస్ కుమార్ దీని మీద మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితుడైన జార్కిహోళిని అరెస్ట్ చేయాలని కోరారు.

 

 

 

కాగా, కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వీడియోలో కనిపించి పదవి కోల్పోయిన మాజీ మంత్రిని మంగళవారం సిట్ అధికారులు బెంగళూరులోని ఆయన నివాసంలో రెండు గంటలపాటు విచారించారు. నాలుగు పేజీల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

 

మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ: సిట్ బృందం సోదాలు…

 

ఆ వీడియో గురించి తనకు నాలుగు నెలల ముందే తెలుసని రమేష్ చెప్పడంతో సిట్ అధికారులు షాక్ అయ్యారు. ఆ వీడియోను చూపించి తనను రూ. ఐదుకోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. అయితే తాను ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. అంతేకాదు, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇలా నకిలీ సీడీతో కుట్ర పన్నారని అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని, ఆ సీడీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.కాగా రాసలీలల వీడియోలో కనిపించే యువతి కోసం సిట్ అధికారులు గాలింపు మొదలుపెట్టారు. ముందుగా… ఈ వీడియో బయటకు రాగానే.. యువతి గోవా వెళ్లిందనే సమాచారం అందింది. అక్కడ గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. కాగా.. గోవా నుంచి ఆమె బెంగళూరుకి.. అక్కడి నుంచి ముంబయికి.. అక్కడి నుంచి తిరుపతి ఆ తర్వాత హైదరాబాద్ కి చేరినట్లు సమాచారం అందింది.

 

 

 

రాసలీలల కేసు : సీడీ విషయం ముందే తెలుసు.. ఐదు కోట్లకు డిమాండ్… !

ఈ క్రమంలో ఆమె కోసం హైదరాబాద్ లో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. తనను మోసగించారని, బెదిరించారని మాజీ మంత్రిపై యువతి సోషల్‌ మీడియా ద్వారా బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. విచారణకు రావాలని బాగల్‌కోటలో ఆమె ఇంటికి నోటీసులు అతికించినప్పటికీ ఆమె నుంచి స్పందన లేదు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Former Karnataka minister Rasali’s CD case turned around ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page